Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండల కేంద్రంలోని మనుబోతుల గడ్డ గ్రామ సర్పంచ్ వల్లెపు సోమయ్య తల్లి వల్లపు ఎల్లమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెంచారు.సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ స్వగృహానికి చేరుకొని, భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. అనంతరం సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఎమ్మెల్యే గారి వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు, మండల కో-ఆప్షన్ షేక్ మస్తాన్, సర్పం చులు సుమన్, భూక్య పద్మావతి వెంకన్న, పార్టీ ముఖ్యనాయకులు ఉన్నారు.