Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ కాకతీయ, ఏకశిలా జర్నలిస్టుల హౌసింగ్ కోపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని సత్వరమే సొసైటీలకు ఇప్పిస్తానని రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి టి హరీష్ రావు హామీ ఇచ్చారు. శనివారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల తనిఖీ, విలేకరుల సమావేశం అనంతరం మంత్రి హరీష్ రావును కాకతీయ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కార్యదర్శి సోమ నరసయ్య, ఉపాధ్యక్షులు రమేష్ బాబు,ఏకశిలా సొసైటీ ప్రతి నిధులు అనిల్ కుమార్, బిఆర్ లెనిన్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. రెండు సొసైటీల ఫైల్స్ సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖలో పెండింగ్ ఉన్న విషయాన్ని మంత్రి కి పూర్తిగా వివరించారు. వారం రోజుల్లో రెవెన్యూ సెక్రెటరీ రాగానే హైదరాబాద్ కు ఇద్దరు వస్తే పని చేసి పెడతానని మంత్రి హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. మీరు హైదరాబాద్కు వచ్చి పని చేసుకోండి,వరంగల్ జర్నలిస్ట్ సొసైటీలకు స్థలం ఇప్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.