Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల
నవతెలంగాణ-వరంగల్
ఇటీవల ఖిలా వరంగల్లో ఓ ప్రైవేట్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఒక బాలి కపై సాంఘిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని శనివారం కిలా వరంగల్ చమన్ సెంటర్లో శోభ అధ్యక్షతన ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఐద్వ రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల, జిల్లా కమిటీ సభ్యులు ఠాకుర్ భవాని మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో అంటూ నిర్భయ నిధులను వెచ్చిస్తున్నా మంటూ, రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం షీటీంలు వేశామంటూ చెప్పుకున్నప్పటికీ, దేశంలో రాష్ట్రంలో మహి ళల పై రక్షణ పూర్తిగా విఫలమైందన్నారు. నిర్భయ చట్ట ప్రకారం కాలేజీ మెయిన్ గేట్ల వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం లేదన్నారు. ఘటన జరిగాక వి చారణ తప్ప ఘటనలు జరగకుండా చర్యలు శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, భాగ్యలక్ష్మి, యాకలక్ష్మి, కమలమ్మ, శాంతమ్మ, వాణీ, శారద, సులోచ న,అనిత, లక్ష్మీకాంత తదితరులు పాల్గొన్నారు.