Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
పైరవీ బదిలీలు ఆపి, జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలని, ఎస్జీటీ, ఎల్పీ స్పౌజ్ బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట యు ఎస్ పి సి హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తూ, రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని, బదిలీల్లో కనీస సర్వీసు నిబంధనను తొలగించాలని, మిగిలిన ఎస్జీటీ, ఎల్పీ స్పౌజ్ బదిలీలను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేదన్నారు. ఏ విధమైన అక్రమాలకు తావులేకుండా బదిలీలు పారదర్శకంగా జరపాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సూచించిన ప్రభుత్వమే పైరవీ బదిలీలకు తెరలేపడం ఉపాధ్యాయుల్లో అశాంతికి కారణమౌతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చిన విధంగా పైరవీ బదిలీలు నిలివేసి, ఉపాధ్యాయులు అందరికీ బదిలీల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని యూఎస్ పిసి రాష్ట్ర బాధ్యులు ఎం.తిరుపతి,ఎ. శ్రీనివాస్ రెడ్డి,ఆర్.రమేష్ డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో యూఎస్పిసి నాయకులు పి .రాజు, సత్యనారాయణ ,కే. శ్రీనివాస్, బి వెంకట్ రెడ్డి,జి. వెంకటేశ్వర్లు,ఏ. గోవిందరావు ,సదాశివరెడ్డి, ఎం. రఘుపతి,టి.సుదర్శనం , టి .కుమార్ ,కే. భోగేశ్వర్, కే. యాకయ్య,జి.అదిరెడ్డి,ఏ.సంజీవరెడ్డి,జి ఉప్పలయ్య,లక్ష్మయ్య, జి.నటరాజ, సదానందం,అబ్దుల్ అలిమ్ ,ప్రకాశ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.