Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-వరంగల్
ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని ఆరెస్సెస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్పొరేట్ అనుకూల, బడా వ్యాపార అనుకూల విధానాల ఫలితం గా అదానీ, ఇతరులు జాతీయ,సహజ ఆస్తులను కొల్లగొడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు.శనివారం హనుమ కొండలో సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పదేపదే ఎత్తిచూపుతోందని, అదానీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసీ సహా ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కోరిందన్నారు. ప్రస్తుతం ఓడరేవు లు, విమానాశ్రయాలు, లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలపై అదానీ గ్రూప్ నియంత్రణ కలిగి ఉందని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ అకస్మాత్తుగా పెరగడం ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహానికి నిదర్శ నం అని అన్నారు. అదానీ గ్రూప్ అవకతవకల కారణంగా సగటు భారతీయ ఇన్వె స్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే భారీ నష్టాలను చవిచూస్తున్నాయన్నారు. అదానీ గ్రూపుకు చెందిన అన్ని ఒప్పందాలపై సమర్థులైన అధికారులతో సమగ్ర విచారణ జరిపి మరింత నష్టాన్ని నివారించాలని సిపిఐ డిమాండ్ చేసిందని, జాతీయ, సహజ ఆస్తుల దోపిడీకి కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు కొట్టెపాక రవిరవి తదితరులు పాల్గొన్నారు.