Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్
నవతెలంగాణ-సంగెం
24 గంటల నిరంతర విద్యుత్ ప్రభుత్వ హామీతో రైతన్నలు యాసింగిలో మొక్కజొన్న సాగుచేస్తున్న తరుణంలో విద్యుత్ అంతరాయంతో రైతులు అయోమయానికి గురవుతూ..? పెట్టిన పెట్టుబడి నేలపాలేనా..?అని ఆలిండి యా కిసాన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. శనివారం మండల కేంద్రంలో ఏఐకేఎఫ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావే శం జరిగింది. ఈ సమావేశానికి కామ్రేడ్ గోనె రామచంద్రు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ హాజరై మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి కరెంటు కోతలు గంటకోసారి కరెంట్ పోవడం వలన రైతు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఒకపక్క యాసింగి సందర్భంగా అనేక ఎక రాలకొద్దీ మొక్కజొన్న, వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ పంటలకు తగి నంత నీరు కావాల్సి ఉంది. కానీ రైతన్నలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమ యంలో కరెంటు కోతలతో ఈ పంటలు పూర్తిగా పండుతాయా..? లేదా..? అని మనోధైర్యం లేక ఆవేదన చెందుతున్నారని అన్నారు. విద్యుత్ అధికారులను అడిగి తే మా దగ్గర ఏం లేదంటూ పై అధికారులు ఎట్లా చెప్తే అట్లా వినాలంటూ సమా ధానం చెబుతున్నారు.ఇదేవిధంగా కరెంటుకోతలు జరుగుతే పంట పూర్తిగా ఎండి పోయే అవకాశం ఉందని, ఈ కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులందరూ సమీకరించి విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. ఈ ధర్నాలకు ప్రభుత్వం, విద్యుత్ అధికారులు బాధ్యత వహించా ల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం రైతులకు సరైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రౌతు శ్రీను, ఎనబోతుల సాం బయ్య, సోమిడి రవి, రాజేందర్, వెంకన్న, తదితర రైతులు పాల్గొన్నారు.