Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టుకు నీటని అందించే పంప్ హౌస్ మోటార్ల పనితీరును శనివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నల్లబెల్లి, ఖానాపురం మండల రైతుల కు రెండు పంటలకు నీరు అందించడమే లక్ష్యంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ములుగు జిల్లాలోని రామప్ప చెరువు నుండి పంప్ హౌస్ మో టార్లను వినియోగించి రంగయ్య చెరువు ప్రాజెక్టుకు నీరును అందించడం జరుగుతుందని, నర్సంపేట నియోజకవర్గం రైతులకు రెండు పంటలకు నీరును అందించడం జరుగుతుంది. భారీ పైప్ లైన్ ద్వారా రంగా చెరువుకు నీటిని తరలించి అక్కడి నుండి పాకాల, మాదన్నపేట చెరువులను నింపే ఇరిగేషన్ సర్క్యూట్ మోటార్లను వాటి పనితీరును పరిశీలిం చారు. అనంతరం రంగా చెరువుకు నీటిని తరలిం చేందుకు నిర్విరామంగా నడుస్తున్న విద్యుత్ మోటార్ల వాటర్ ఇన్ టేకింగ్ కెపాసిటీని గమనించారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నా యక్, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల నాయకులు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, బత్తిని శ్రీనివాస్, బానోతు సారంగపాణి, కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, పాలపు రాజేశ్వర రావు, ఉపేందర్ రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఈ విజయభాస్కర్, ఈఈ వెంకట కృష్ణారావు, డిఈ య శ్వంత్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం...
గ్రామాలలో సుందరంగా రూపుదిద్దుకుంటున్న సిసి రోడ్లు నిర్మాణ పనులు, మండలంలోని రుద్రగూ డెం గ్రామంలో 40 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మా ణ పనులు చేపట్టగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. నర్సంపేట నియో జకవర్గ వ్యాప్తంగా 100శాతం సిసి రోడ్ల పనులను పూర్తి చేసుకున్న శుభ తరణం అని అన్నారు. 150 కోట్ల నిధులు ఇంటర్నల్ రోడ్ల కొరకు మంజూరు చే యించడం జరిగిందని, మరో రెండు మూడు నెలల్లో 100శాతం అంతర్గత, లింకేజీ రోడ్లు పూర్తి చేసుకుం టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓడిసిఎమ్మెస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ద స్వప్న, మండల పార్టీ కన్వీనర్ ఉడు గుల ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీని వాస్ గుప్తా, మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి, కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, పాలపు రాజేశ్వరరావు, స్థానిక సర్పం చ్ మల్లాడి కవిత విజేందర్ రెడ్డి, మండల నాయకు లు మల్లాడి సాంబ రెడ్డి, సూరయ్య, మాజీ సర్పంచ్ ఇంగ్లీ శివాజీ, అంబరకొండ రాజు, సొసైటీ డైరెక్టర్ మంద రాజిరెడ్డి, ఉపసర్పంచ్ బైకానీ శివ కోటి, అబ్బు జయపాల్ రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచులు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాలో అవాంతరాలను నియంత్రించాలి
నర్సంపేట : విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న అవాంతరాలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ ఇంజనీ రింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారం రోజులగా నియోజకవర్గ వ్యాప్తంగా యాసంగి వరి నాట్లు వేస్తు న్నారని ఈ తరుణంలో విద్యుత్ సరఫరా విపరీత మైన డిమాండ్ ఉంటుందని,ఇందుకుగాను గుణంగా వ్యవసాయ పెంపు సెట్లకు సరిపడా నాణ్యమైన వి ద్యుత్‌ను అందించాల్సిన అవసరం ఉందన్నారు. సాం కేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్న ప్రాంతాన్ని గు ర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వి ద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురు కా కుండా సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఫలితంగా సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించగలిగా మన్నా రు.రెండు మూడ్రోజుల్లో సరఫరాలో ఆటంకాలు చో టు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే ఎన్పీడీసీఎల్ సీఎండీతో చర్చించామని తెలిపారు. యాసంగిలో సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా రు.ఈ సమావేశంలో డీఈ ఎన్. సదానందం, ఏడీఈ అమ్రు నాయక్, చలపతిరావు, ఏఈలు శ్రీధర్, మచ్చ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.