Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు యాదగిరి
నవతెలంగాణ-కాశిబుగ్గ
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకా శాలు కల్పించాలని సిపిఐ (ఎం)వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడు అక్కెనపల్లి యాద గిరి డిమాండ్ చేశారు. వరంగల్లో పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లేబర్ కాలనీ 100 ఫీట్ల రోడ్డు నుండి వెంక ట్రామ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అక్కెనపల్లి యాదగిరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24 బడ్జెట్లలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక నిధు లు కేటాయించాలన్నారు. వరంగల్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలం టే చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వాలను కోరారు. నగరంలో వేలాదిమందికి ఉపాధి కల్పించిన ఆజంజాహీ మిల్లు 30 సంవత్సరాల క్రితం మూసివేయగా నాటినుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఒక్క పరిశ్రమను నెలకొల్పిన పాపన పోలేదని మండిపడ్డారు. నగరంలో ఉన్నత చదు వులు చదివిన యువత ఉద్యోగాలు లేక ఆటో డ్రైవర్లుగా భవన నిర్మాణ కార్మికులు గా గుమస్తులుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.వీరందరికీ పని కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైల్వే బడ్జెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కి నిధులు కేటాయించాలన్నారు. నగరంలో రైల్వే, లెదర్, కాటన్ పరిశ్రమల పరిశ్ర మల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్.కె పాషా, ఇల్లందుల అనిత, కంది రవి, భద్రయ్య, రవిరాకు ల ప్రసంగి, నగేష్, కళావతి, మంజుల శాఖ కార్యదర్శులు జన్ను ప్రమోద్, జనగా మ శ్రీనివాస్, బొంపల్లి అశోక్, జన్ను ప్రవీణ్, చెల్పూరి మల్లికార్జున్, సుస్మిత, చిన్నమల్లు, కల్పన, శైలజ, కొంరమ్మ, గౌరీప్రియ, తదితరులు పాల్గొన్నారు.