Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కేంద్ర బడ్జెట్లో విద్యకు 10శాతం నిధులు, రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు ఇవ్వా లని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్ఎస్ ప్రభు త్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని, కేంద్ర బడ్జెట్లో గత రెండు సంవత్సరాల నుంచి విద్యకు మూడు శాతం మించి నిధులు ఇవ్వడం లేదని, రా ష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని 2014-15 బడ్జెట్లో 10.89 శాతం నిధులు కేటా యించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత సంవత్సరాల నుంచి విద్యకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారని ఆరోపించారు. గత రెండు సంవత్సరా ల బడ్జెట్లో విద్యకు నిధులు ఆరు శాతం పెంచడం లేదని బిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోని కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 25శాతం పైగా నిధులు కేటాయిస్తున్న మన రాష్ట్రంలో ఇలా ఆరు శాతం కేటాయిస్తూ మన రాష్ట్రా న్ని అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకోమని చెప్పడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుం దని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వస్తాం సాయికిరణ్, కిన్నెర సోయల్, యశ్వంత్, ముఖేష్, నరేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి
బయ్యారం : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ఏఐఎస్ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రన్ని తహసీల్దార్ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు వెంకటేష్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వ డం లేదని కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందని అన్నారు. లేని యడల విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోకల ఉదరు, గనేష్, తుడుం పవన్ తదితరులు పాల్గొన్నారు.