Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా టాస్క్ఫోర్స్ కన్వీనర్, ఆర్డీవో సిహెచ్.మధుమోహన్
నవతెలంగాణ-జనగామ
జనగామ పట్టణంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జిల్లా టాస్ ఫోర్స్ కన్వీనర్, రెవెన్యూ డివిజనల్ అధికారి,సిహెచ్. మధుమోహన్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల అనుమ తులు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, కట్టడాల ను శనివారం జనగామ పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగా,(బతుకమ్మ కుంట) ప్రీస్టన్ కాలనీలలో కూల్చివేతలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కన్వీనర్ సిహెచ్.మధుమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవన నిర్మా ణాలు అనుమతులు తీసుకొని అనుమతులకు లోబడకుండా ఇష్టానుసారంగా ని ర్మాణాలు చేపడితే చట్ట పరంగా చర్యలు తీసుకొని కూల్చివేతలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇప్పటికే పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించామని ఆయ న చెప్పారు.ఈకార్యక్రమంలో జిల్లా టాస్క్ఫోర్స్ కన్వీనర్, సిహెచ్. మధుమోహన్, జిల్లా కమిటీ సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ, జిల్లా ఫైర్ అధికారి, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.