Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మైలీ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్ కోరుకోప్పుల మహేష్‌ను అభినందించిన గ్రామస్తులు, ఎస్సై పత్తిపాక జితేందర్
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన డోనికేని రమేష్ గౌడ్ చాలా సాధా రణ కుటుంబం.రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. రమేష్ గౌడ్ కూతురు డోనకని జాహ్నవి షూటింగ్ బాల్ గేమ్ నేషనల్ స్థాయికి ఎంపిక అవడంతో ఉన్నత స్థాయి కి ఎదగాలని స్మైలీ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ కోరుకొప్పుల మహేష్ సహకారంతో 50వేల రూపాయలను తన సొంతంగా ఇచ్చినట్లు ఎస్సై పత్తిపాక జితేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి ఫౌండర్ తండ్రి కోరుకొప్పుల రామానుజం చేతుల మీదు గా జాహ్నవికి ఘనంగా శాలువతో సత్కరించి 50 వేల రూపాయలను ఆర్థిక సహా యం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాహ్నవి చిన్నప్ప నుండి గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి చదువుతూ షూటింగ్ బాల్ గేమ్‌లో నేషనల్లకు సెలెక్ట్ అయింది. వారి యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా నేషనల్ దాకా వెళ్లలేక పోతుంది. దీంతో విషయం తెలుసుకున్న నెల్లికుదురు గ్రామానికి చెందిన స్మైలీ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ కోరుకొప్పుల మహేష్ గౌడ్ దృష్టికి రాగానే నేషనల్ స్థాయికి పంపాలని ఉద్దేశంతో మహేష్ గౌడ్ వ్యక్తిగతంగా 50వేల రూపా యల ఆర్థిక సహాయం జహ్నవికి మహేష్ గౌడ్ అందించారు. ఇంత పెద్ద సహాయాన్ని అమ్మాయికి అందించిన ఫౌండర్ కోరుకోప్పల మహేష్‌ను మండల ప్రజలు పొరపాటు వెంకటరెడ్డి ప్రజలు అభినందించారు.ఈ సందర్భంగా నేషనల్ గేమ్ సెలెక్ట్ అయిన జాహ్నవి నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతగా రుణపడి ఉంటాను అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకటరెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంక టేశ్వర్లు పులి రామచంద్రు రమేష్ జగన్ గండి వెంకన్న ఎడ్ల మహేష్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.