Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్
నవతెలంగాణ-మహాబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాద్ డివిజన్ కార్యదర్శి గుగులో సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. శనివారం డివిజన్ నాయకుడు సింహాద్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకా ష్ హాజరై మాట్లాడారు. గిరిజన జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులకు మోగ్గు చూపుతున్నారని, గిరిజన విద్యార్థుల,దూరభారం వల్ల సాంకేతిక విద్యకు గిరిజన విద్యార్థులు, విద్యార్థినులుకు అందని ద్రాక్షగా అవుతుంది అని సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కళాశాల లేకపోవడంతో వా రు చదువుకోవడానికి ఇతర ప్రాంతాలు ,ఇతర జిల్లాలు వెళ్ళవలసి వస్తుందని, నిరుపేద కుటుంబం అవ్వడం వలన మధ్యలోనే కోర్సు పూర్తి చేయకుండా మానే స్తున్నారు అని అన్నారు. అందరికీ ఆమోదోగ్యమైన స్థానిక గిరిజన జిల్లా కేంద్రంలో సాంకేతిక పరిశోధన కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, బడ్జెట్లో విద్య రంగానికి 30 శాతం కేటాయించాలని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, గిరిజ న సంక్షేమ, గురుకులాల్లో, హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు రాజేష్, ఉపేందర్, నితిన్, వినోద్, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.