Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం అధ్వర్యంలో ఘనంగా తాళ్లూరి 9వ వర్థంతి
నవతెలంగాణ-గార్ల
ప్రజలకు ఏ సమస్య వచ్చినా క్షణంలో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలలో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడిగా తాళ్లూరి నరసింహరావు నిలి చారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. సిపి ఎం సీనియర్ నాయకులు తాళ్లూరి నరసింహరావు(నర్సయ్య) 9 వర్దంతి కార్యక్ర మాన్ని మండలంలోని బుద్దారం గ్రామ చౌరస్తాలోని నర్సయ్య స్థూపం వద్ద సిపి ఎం అధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగం లోకేశ్వరావు అధ్యక్షత జరిగిన వర్దంతి సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ధని క వర్గంలో పుట్టిన నర్సయ్య సిపిఎం ఇల్లందు డివిజన్ నాయకులుగా,గార్ల మండ ల సీనియర్ నాయకులుగా ఉంటూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలే ని కృషి చేశారని అన్నారు. బుద్దారం పంచాయతీలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తూ వందలాది మంది ప్రజలను సమీకరించి అందోళనలు, పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసే వారిని అన్నారు. అటు నాయకుడుగా, ఇటు ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమాలకు రూపకల్పన చేసే వారిని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలను పెద్ద ఎత్తున భూ పోరాటాలు నిర్వహించి గిరిజనులు, దళితులకు ఇండ్ల స్థలాలు, సాగు భూములు ఇప్పించారని అన్నారు.బుద్దారంపంచాయతీలో ఇండ్ల స్థలాలు నర్సయ్య చేసిన పోరాటానికి స్పూర్తిగా గుడిసెలువేసుకున్న దళిత ప్రజలు తాళ్లూరి నర్సయ్య నగర్ అని పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.తుది శ్వాస వరకు ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా సాధారణ జీవితం గడిపిన నర్సయ్య రైతు లు, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన నర్సయ్య ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముందుగా నర్సయ్య చిత్ర పటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ వర్దంతి సభలో జిల్లా, మండల నాయకులు సిపిఎం భూక్య హరి, జి.రాజారావు, ఎ.వీరాస్వామి, సిహెచ్.ఎల్లయ్య,ఐ.గోవింద్,యం.శాంతికుమార్, ఎస్.కె.బాజీ,మోహన్, ఎస్.వెం కటేశ్వర్లు, ఇ.రాము, బి.లక్ష్మయ్య, వి.కొండయ్య, మాజీ సర్పంచ్ బి.రాందాస్, లాయర్ హరి, డోర్నకల్ మండల సిపిఎం నాయకులు యూ.వెంకటేశ్వర్లు, డి.మల్లే శం, బి.వీరాస్వామి,వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.