Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్, శ్రీనిధి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. ఆదివారం తొర్రూర్‌లోని శ్రీనివాస్ గార్డెన్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా మహిళలు కుట్టు మిషన్ శిక్షణ శిబిరా నికి భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చిట్యాలలో ఎంపీపీ మాట్లాడు తూ కేసీఆర్ఆర్ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు అనే క పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ సుధాకర్, మత్స్య శాఖ నాయకులు పిట్టల వెంకటేశ్వర్లు, ఈదురు మోహన్, మహేందర్, సీఏలు తోట స్వాతి, రాయిపెల్లి మమత, పులుగుజ్జా రమ, ఆశా వర్కర్లు పులుగుజ్జా శోభ, ఈదురు సునిత పాల్గొన్నారు.