Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ భూముల ఆక్ర మణలను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల ర మేష్ డిమాండ్ చేశారు. ఆది వారం సీపీఐ మండల సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూ ములు ఎక్కడిక్కడా కబ్జా చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేస్తే మాత్రం పోలీసులచే అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కేసులను ఎత్తివేసి ఆక్రమ ణలను అరికట్టాలని లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెల్లి రమేష్, మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, జిల్లా సమితి సభ్యులు మి యాపురం గోవర్థన్, నాయకులు ఇల్లందుల సాంబయ్య, పాల కవిత, ఐత యాకో బు, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.