Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరెంట్ కోతలను నిర సిస్తూ సీపీఐ(ఎం), రైతు సంఘం ఆధ్వర్యంలో నిరస న తెలిపారు. మండలంలోని ఆధ్వర్యంలో ఆదివారం మ హేశ్వరంలో ప్రధాన రహ దారిపై రాస్తారోకో చేపట్టారు. లక్నెపెల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ కరెంట్ కోతల వల్ల పంటలకు సాగు నీరందక ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం వెంటనే అప్రకటిత కరెంట్ కోతలను ఎత్తివేయాలని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బీ.మల్హల్రావు, కట్కూరి శ్రీనివాసరెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.