Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రా రంభించనున్న నవోద య ఉచిత కోచింగ్ కో సం మండలంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం మండల కేంద్రంలోని విద్యాభారతి హై స్కూల్లో నిర్వహించిన ప్రతిభాపరీక్షకు అ నూహ్య స్పందన వచ్చిందని తరుణి సంస్థ మండల కోఆర్డినేటర్ రణధీర్ తెలిపా రు. విద్యార్థులతో వచ్చిన పేరెంట్స్‌కి కూడా నవోదయ స్కూల్స్‌లో ఉండే అత్యాధు నిక వసతులు, ప్రత్యేకతలు, అప్లికేషన్ విధానం, సిలబస్ గురించి వివరించామ న్నారు. ఇంకా అప్లై చేయని వారు ఉంటే 31 జనవరి చివరి తేదీ కావున త్వరగా అప్లికేషన్లు చేయాలని కోరారు. ఫలితాలను కూడా వారి తల్లిదండ్రులకు మెసేజ్ ద్వారా పంపించమన్నారు. టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫిబ్ర వరి మొదటి వారంలో ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో విద్యాభారతి కరస్పాండెంట్ మైదంశెట్టి చందర్, తరుణి ఫ్యాకల్టీ పురు షోత్తంరెడ్డి, జీవన్, క్లస్టర్ కో-ఆర్డినెటర్స్ జ్యోతి, మౌనిక, లైబ్రేరీయన్ భవాని, వాలంటీర్స్ అశ్విని, మౌనిక, పిఈటి మౌనిక తదితరులు పాల్గొన్నారు.