Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్రూరల్
మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, దేశంలోనే తెలంగాణ మహి ళలు ఆదర్శం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని వెలికట్ట శివారు శ్రీనివాస గార్డెన్లో సెర్ప్, శ్రీ నిధి సంస్థల ఆధ్వర్యంలో తొర్రూరు, పెద్ద వంగరం మండలాల మహిళలకు ఉచి త కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభమైంది.ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ము ఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, మహిళల అభివృద్ధి లక్ష్యంగా సెర్ప్, స్త్రీనిధి సహకా రంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోనే కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ మహిళలు ఉపాధి పొందేందుకు కుట్టు శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. మ హిళా సంఘాల ద్వారానే ధాన్యం ఇతర పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయి స్తూ వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ్య, ఎంపీపీలు తూర్పాటి చిన్న అంజయ్య, ఈదు రు రాజేశ్వరి, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, మున్సి పల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మహిళా సంఘాల నాయకులు నాగమ ణి, రేణుక, విజయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నా యకులు కిషోర్ రెడ్డి, సోమ నర్సింహారెడ్డి, సురేందర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రా మిని శ్రీనివాస్, అంకూస్ తదితరులు పాల్గొన్నారు.