Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్
నవతెలంగాణ-నరసింహులపేట
కవులు సమాజానికి జవసత్వాలు అని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీని వాస్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దనాగారం గ్రామంలో ఎస్కెఎస్ వేడుకల మందిరంలో వికాస వేదిక సాహిత్య సంస్థ మహబూబాద్ జిల్లా ఆధ్వర్యం లో శతాధిక కవి సమ్మేళనం 2023వ సంవత్సరాన్ని పురస్కరించుకొని నాలుగు పుస్తకాలను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కవితలు జీవిత కవిసమ్మేళనాలు నిర్వ హిస్తూ,ప్రజల్లో సామాజిక ధృక్పథానిపై చైతన్యం కలిగిస్తూ మహానగరాలలో కా కుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కవి సమ్మేళనాలు, పుస్తకాల ఆవిష్కరణలను చేయాలని ఆయన కోరారు.మంచిపూలు అనేపుస్తకాన్ని రచించిన రచయిత ఎండి జహీరుద్దీన్, సాధనాల రచించిన సాధనాల సాహితీ సౌరబాలు, గుండె చప్పుడు రచించిన కొంపల్లి రామయ్య,లెనిన్ శ్రీనివాస్ రచించిన కలలు చెదిరిన కళ్ళు అనే నాలుగు పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి,స్టేజి సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి,పెద్దనాగారం గ్రామ సర్పంచ్ పులిచింతల కళావతి, వికాస వేదిక అధ్యక్షుడు సాధనాల వెంకటస్వామి, ఉస్మాని యా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చలమల్ల వెంకటేశ్వర్లు,జాషువా సాహి త్య వేదిక అధ్యక్షుడు మువ్వ శ్రీనివాసరావు, ముక్క సత్యనారాయణ,కొంపల్లి రామ య్య,ఎండి జహురుద్దీన్, కొమ్ము పుల్లయ్య,ఆంగోతు జయ వాసు,కొత్త శంకర్ రెడ్డి, నామవరపు కాంతీశ్వరరావు, మలిశెట్టి కృష్ణమూర్తి, లెనిన్ శ్రీనివాస్ ఉన్నారు.