Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలంలోని తీగరాజు పల్లి సెంటర్ నుండి సబ్ స్టేష న్ వరకు ఆలిండియా కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) రైతు సంఘం ఆధ్వర్యంలో కరెంటు కోతులకు వ్యతిరేకంగా రైతులు ర్యాలీ నిర్వహించారు. నాణ్యతమైన విద్యుత్ అం దించాలని రైతు పంటలలో ఎండిపోకుండా చూడాలని సరైన టైమ్‌కు విద్యుత్ అందించాలని ఎన్టీఆర్ విగ్రహం నుండి కరెంటు సబ్ స్టేషన్ వరకు రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎండి ఇస్మాయిల్, గోనె రామచందర్ మాట్లా డుతూ గత వారం రోజుల నుంచి ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుందో..? రైతులకు తెలియకుండా పోయిందన్నారు. రాత్రిపూట కరెంటు ఇవ్వడం వలన రై తులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇట్టి విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ అధికారులు మాకు ఏం తెలియదు పైనుంచి ఎట్లా చెప్తే గట్ల వినాలని సమాధానం చెబుతున్నారన్నారు.ఒకపక్క ప్రభుత్వం విద్యుత్తు అంతరా యం లేదని చెప్పినప్పటికీ విద్యుత్తు అంతరాయం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల యొక్క పంటలకు నష్టం కలిగేలా విధంగా,పూర్తిగా ఎండిపోయే స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ పంటల నష్టాలకు ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఒక్కొక్క రైతు మినిమం రెండు ఎకరాలు, మూడెకరాలు మొక్కజొన్న విస్తీర్ణం సాగుచేశారు.అందులో వరి,మొక్కజొన్నకు లక్షరూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయే దశలో ఉన్నారన్నారు. ఇదే విధంగా కొనసాగితే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరినీ, సమీకరించి భారీ ఎత్తున సబ్ స్టేషన్ల ముందు ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎనబోతుల సాంబయ్య, రౌతు శ్రీనివాసు, దూడన్న, రవి, వెంకన్న పాల్గొన్నారు.