Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి దేవేందర్ రావు
నవతెలంగాణ-పర్వతగిరి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రధాన హామీగా రైతులకు ఇచ్చిన ఇరువై నాలు గు గంటలు విద్యుత్ ఇస్తామన్న మాట నీటిమూట గానే మిగిలపోయిందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి దేవేందర్విమర్శించారు. గీసుగొండ మండ లంలోని కోనాయమాకుల సబ్ స్టేషన్ ముందు ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఏఈకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు సీఎం కేసీఆర్ ఎన్నికల హామీగా 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. అన్నదాత కష్టాలను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారు. రైతుల సమస్యలు పరిష్క రించకుంటే రెండు మూడు రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడి స్తామని ఆయన హెచ్చరించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెల్లుతుందన్నారు. దేశంలో కంటి రెప్పపాటు కరెంటు పోకుంట 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇది అబద్ధం. 24 గంటల కరెంటు ఎక్కడ రావడం లేదు..? కళ్ళున్న కబోదులా?.. చెవుల్లో సీసం పోసుకున్నారా? గ్రామంలో కరెంటు వస్తుం దా..? రావడం లేదా..? మీకు తెలియడంలేదా..? అనిప్రశ్నించారు. ఏసిడి పేరు తో అడ్డగోలుగా కరెంటు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మన పెల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చాడ కొమురా రెడ్డి, రుద్ర ప్రసాద్, అప్పని కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.