Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులకు హక్కు పత్రా లు ఇవ్వాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. ఆదివారం ములు గులో జంగిలి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ములుగు జిల్లా కమిటీ సమావేశంలో రవి మాట్లాడారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభు త్వాలు పోటీలు పడి విద్యుత్తు డిస్కములకు అను మతులు ఇస్తూ ప్రజలపై ఏసీడీల పేరుతో అదనపు చార్జీల పేరుతో ఏప్రిల్ నుండి యూనిట్‌కు 30 పైసలు వసూలు చేసుకోవాలని అనుమతులివ్వడం సరికాదన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3వ తేదీన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 60 గజాల ప్రభుత్వం స్థలం చూపించి ఇండ్లు నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభు త్వం కబ్జా దారుల నుంచి ప్రభుత్వ భూములు కాపా డుతున్న నాయకులను నర్సంపేటలో అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని, తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు మాడిశెట్టి మల్లయ్య,రాస రాజన్న, కామ రాజమల్లు, చెవుల సమ్మయ్య, కామ రవి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.