Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
భారతదేశ స్వాతంత్య్రంకోసం పోరాడిఅసువు లుబాసిన ఎందరో మహానీయులు అమరవీరుల త్యా గాలను స్మరించుకోవడం భారతీయుల అందరి బా ధ్యత అని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అ న్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పు రస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కలెక్టర్‌తో పాటు అదికారులందరూ రెండు నిముషాలు మౌనం పాటిం చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యజించి పోరాడి అసు వులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలం గా ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతు న్నామని ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సే వలు స్మరించుకొని వారిఆశలు, ఆశయాలకను గు ణం గా ముందుకు సాగాలని సూచించారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యో ధుడు మహాత్మాగాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, శ్రీవత్సవ్, ఆ ర్డీవో మహేందర్ జీ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : జాతిపిత మాహాత్మ గాంధీవర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాం గ్రె స్పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ క మిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి ఆశయా లను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అ న్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీ నివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జి ల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, నగ ర కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు తది తరులు పాల్గొన్నారు.
నెక్కొండ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధింపజేయ డంలో ప్రముఖపాత్ర వహించిన మన జాతిపిత మ హాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం లోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ పూలమాలవేసి ఘ నంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, ఎస్టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్యా తిరుమల్, మండ ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి, వరంగల్ వీఆర్ఏ ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెస ిడెంట్ బోడ శ్రీకాంత్‌నాయక్, వార్డు సభ్యులు పోలిశె ట్టి భానుప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేలేరు : మండల కేంద్రం వేలేరులోని గాంధీ వి గ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు పిన్నింటి తిరుపతి రెడ్డి, వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుసేన్ ఆధ్వర్యం లో గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలోవార్డు మెంబర్ అత్తెన రా జేందర్, శాలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కూరపాటి శంకర్, యూత్ అధ్యక్షులు అక్కలఉపశాంత్, మల్ల య్య రాజు, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : జాతిపిత మాహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా నడికూడ మండలంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ శాంతి మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి జాతిపితగా అం దరి మన్ననలు పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి మలహల్రావ్, గ్రామా కమిటీ అధ్యక్షులు తాళ్ళ నవీన్, యూత్ కాంగ్రెస్ అ ధ్యక్షులు అప్పం కుమారస్వామి, జిల్లా రేవంత్, మిత్ర మండలి అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి, నర్సక్కపల్లి అధ్యక్షులు కుమారస్వామి,రాజు,మచ్చసుమన్, గోవిం దుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీవోస్ కాలనీ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ అద్వర్యం లో సోమవా రం రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్ లో రెడ్ క్రాస్ సిబ్బం దికి జిల్లా వైద్యశాఖ హనుమకొండ సహకారంతో కం టి వెలుగు కార్యక్రమాన్ని హనుమకొండ డిఎం అండ్ హెచ్ఓ సాంబశివరావు, రెడ్‌క్రాస్ సొసైటీ పాలక వర్గం చేతులమీదుగా ప్రారంభించినారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్బంగా పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన వం తు సహకారం ఎల్లప్పుడూ ఈ సంస్థ కు ఉంటాయ న్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం ఫై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ మెడల్ ను డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు కు పాలకవర్గం చే తుల మీదుగా అందచేశారు. కరోనా సందర్బంగా అందించిన సేవలకు గాను అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ మదన్ మోహన్‌రావు, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ యాకుబ్ పాషా, పీహెచ్సీ వడ్డేపెల్లి డాక్టర్ మాలిక, డిఈఎంఓ అశోక్‌రెడ్డి షీల్డ్, శాలువాతో సన్మా నించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్ టి. విజయలక్ష్మి,పెద్ది వెంకట్‌నారాయణగౌడ్, చెన్నమనే ని జయశ్రీ, రెడ్క్రాస్మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కిషన్ రావు,డాక్టర్ సత్యం, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.