Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యుత్ కోతలను ఎత్తివేసి నాణ్యమైన నిరవధిక సరఫరా చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి, కాంగ్రెస్ మండల నా యకులు కత్తి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. మం డలంలోని లక్నెపెల్లిలో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై విద్యుత్ కోతల ను నిరసిస్తూ సీపీఐ(ఎం), కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడు తూ పదిరోజులుగా వ్యవ సాయ విద్యుత్ సరఫరా కో తలు విధిస్తున్నారని ఫలి తంగా పంటలు ఎండిపో తున్నాయని ఆందోళన వ్య క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును 24గంటలు సరఫరా చేస్తున్నామని చెబతున్నా అం దుకు విరుద్ధంగా సరఫరా కావడం లేదని తెలిపారు. విద్యుత్ కోతల వల్ల పంటలకు సాగు నీరందకుండ పోతుందని, వేలాపాలలేని విద్యుత్ సరఫరా వల్ల రై తులు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు.
విద్యుత్ పంప్సెట్లు కాలిపోతూ ఆర్థింగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభు త్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాలో అ వాంతరాలను నివారించి నాణ్యమైన 24గంటల పా టు సరఫరా చేయాలన్నారు. లేకపోతే రాబోయే రో జుల్లో రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హె చ్చరించారు సీపీఐ(ఎం) గ్రామకార్యదర్శి కత్తి కట్ట య్య, శాఖా కార్యదర్శి రాజులపాటి సూరయ్య, గ్రామ నాయకులు పాత్కాల సుధాకర్, మండల నాయకులు కట్కూరు శ్రీనివాసరెడ్డి, మర్ద లక్ష్మీనర్సు, కాంగ్రెస్ గ్రా మ అధ్యక్షులు ఐలోని అశోక్, కాంగ్రెస్ యూత్ మం డలనాయకులు ఎంబడి గణేష్, సూదుల మహేందర్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి వేణు, కత్తి విక్రమ్, జిం కల సంపత్ తదితరులు పాల్గొన్నారు.