Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు శోభారాణి
నవతెలంగాణ-భీమదేవరపల్లి
రాష్ట్రంలో బాలల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఏ.శోభరాణి అన్నారు. మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామిని ఆమె సోమవారం దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా ముల్కనూర్ ఆరవ అంగన్వాడి సెంటర్ మోడల్ స్కూల్ క స్తూర్భా బాలికల పాఠశాల గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలను ఆమె సంద ర్శించారు. మొదటగా అంగన్వాడి సెంటర్లో చిన్నారులకు అందిస్తున్న సేవలు ఆటపాటల గురించి తెలుసుకున్నారు. కొంతసేపు చిన్నారులతో ఉల్లాసంగా గడి పారు కస్తూర్బా బాలిక పాఠశాల విద్యార్థినీలు గట్ల నర్సింగా పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సమాజంలో ఆడ మగ అనే లింగ భేదాన్ని రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆడపిల్లలపై ఉన్న వివక్షను విడనాడాలని ఆడపిల్లల చదువు దేశాభివద్ధికి దోహదం చేస్తుందనే విషయం తెలుసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జెడి ఝాన్సీ లక్ష్మీబాయి, డీడబ్ల్యుఓ సబిత, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు డాక్టర్ సుధాకర్, దామోదర్, సర్పంచ్ కొమురయ్య, ఆర్బి కో-ఆర్డినేటర్ శిరీష, సీడీపీవో స్వరూప, సీఎంవో రాధ, ఎంఈఓ వెంకటేశ్వరరావు, డీసీపీవో సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ అధికారి ప్రవీణ్‌కుమార్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ కష్ణమూర్తి, సూపర్వైజర్లు సుశీల, అనితారాణి, సోషల్ వర్కర్లు సునీత, మాడుగుల రమేష్, అంగన్వాడి టీచర్ పి.రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.