Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృ త్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులపంపిణీ కార్యక్రమాన్ని ఏర్పా టు చేయగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరిం చుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం నియోజక వర్గంలోని పరకాల మండలం, మున్సిపాలిటీ, ఆత్మ కూర్, సంఘం, నడికూడా, దామర మండలాల్లోని ఆ యా గ్రామాల కళ్యాణ్లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదా రులకు రూ.1.16 కోట్లకు పైగా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిరుపేదలకు అండగా ఉండి అభివద్ధి ధ్యేయం గా సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. రైతే రాజు గా ఉండాలని ఆకాంక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ధృఢ సంకల్పంతో ఉండి రైతులకు రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాలను అందించడంతోపాటు అధిక దిగుబడి అందించేలా, రెండు పంటలకు పుష్కలంగా నీరు ఉండాలని 24 గంటలు ఉచిత కరెంటు అంది స్తున్న ఘనత మన రాష్ట్రం అన్నారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మితో పాటు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టుసై తం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్‌లు రాష్ట్రం అభివృద్ధి చే స్తుంటే ఇతర రాష్ట్ర సీఎంలు మన అభివృద్ధిని చూసి మనరాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఐటీరంగంలో హైదరాబాద్ అమెరికా కంటే అభివృద్ధి చెందుతుం దని లక్షల్లో జీతాలు సాఫ్ట్వేర్ ఉ ద్యోగులు పొందుతు న్నారన్నారు. తెలివిగల యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం లేదన్నారు. నియోజకవర్గంలో త్వరలోనే కాకతీయ టెక్స్టైల్ పార్కు దసరా లోపు ప్రారంభమవు తుందని అందులో 35 ఏళ్ల వయసు గల వితంతు మహిళలు ఎవరైనా ఉద్యో గం చేయాలని ఆసక్తి ఉంటే వారికి ఉద్యోగం ఇప్పిస్తా న న్నారు. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుం టుందని విమర్శించారు. పరకా లలో అభివృద్ధి జరగట్లేదు అనడం బీజేపీ నాయ కు లకు క ళ్ళులేవా అని విమర్శించారు. బిజెపిని ప్రజలు త్వర లోనే తగినగుణపాఠం చెబుతారన్నారు.బిజెపి నాయ కులు సన్యాసులని, గల్లీలో రాజకీయం తప్ప ని జమై న రాజకీయ పాలన తెలువదని,నిన్న, మొన్నటి బిజె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుండు సన్యాసి లా మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షోద అనిత రామ కృష్ణ, వైస్‌చైర్మన్ జైపాల్ రెడ్డి ,మార్కెట్ చైర్మన్ సారం గపాణి, నియోజకవర్గంలోని మండల జెడ్పీటీ సీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయ కులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ డికొండ శీను, అధికారులు పాల్గొన్నారు.