Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలంలోని గవిచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీకింద 40 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన సిసి రోడ్డు పనులను ఎంపీపీ కందగట్ల కళావతి నర హరి, జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డితో కలిసి సర్పంచ్ దొనికేల రమ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడు తూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు బిఆర్ఎస్ అయంలోనే మహర్దశ వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కషితో మండలంలో అనేక అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.మండలంలో ప్రతి గ్రామంలో వాడవాడల సిమెంట్లు రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు. మండలంలో రోడ్లు నిర్మాణ పలనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సిసి రోడ్లు మంజూరు చేసినం దుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతిపథంలో ముందుకు వెళ్లాలని ఆలోచనతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్ని గ్రామాలలో సిసి రోడ్లను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. రోడ్డు పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి, వార్డు మెంబర్లు, వజ్జ కేశవుల రాజు, హేమలత, మంజుల కుమార్, కాపుల కనపర్తి సొసైటీ వైస్ చైర్మన్ ముడిదే శ్రీనివాస్, పత్తిపాక రమేష్, పంచాయతీ కార్యదర్శి సోనా బోయిన కిరణ్, ఎండి సాదిక్ పాషా,తదితరులు పాల్గొన్నారు.