Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-సుబేదారి
సోమవారం జరిగిన ప్రజా వాణిలో వస్తున్న ఫిర్యాదు లకు ఎలాంటి కాలయాపన లేకుం డా తక్షణమే స్పందించి పరిష్క రించవలసినదిగా హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అడిషనల్ కలెక్టర్, వివిధ జిల్లా స్థాయిఅధికారులు ,సిబ్బందితో కలిసి ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి ,అమరవీ రుల దినోత్సవం సంధర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణిలో జిల్లానలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన వినతులను అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, సిపీవో సత్యనారాయణలు తీసుకొని వినతులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇం దులో ఎసిపి కాజీపేట 2,మైన్స్, జియాలజి 1,అనిమల్ హాసబండరి1, ఇరి గేషన్2, సర్వే ల్యాండ్ రికార్డ్ 1ఆర్ ఈ హెచ్1, డీఈవో ఆఫీస్ 1,ఆర్డీవో ఆఫీస్1, ఎస్సి కార్పొరేషన్10, డిపివో ఆఫీస్ 2 తదితర శాఖలకు సంబంధించి మొత్తం 95 దరఖాస్తులు వచ్చినవి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఎండబ్ల్యూవో మేన శ్రీను, జీఎమ్ ఇండిస్టీస్ హరి ప్రసాద్, డీడబ్ల్యూవో సబితా,ఎస్సి కార్పొరేషన్ ఈడి మాధ విలత, డీసిఎస్ వో వసంత లక్ష్మి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.