Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ కార్పొరేషన్ పరిధి పలు డివిజన్లలో చేపడుతున్న అ భివృద్ధి పనులను సకాలంలో పూ ర్తి చేయాలని జిడబ్ల్యూ ఎంసీ క మిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారంజిడ బ్ల్యూఎంసీ పరిధిలోని పూర్తయిన పలు అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపు నిమిత్తం పరిశీలించారు. 61వ డివిజన్లో ఏర్పాటు చేసిన రెండు పట్ట ణ ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 61వ డివిజన్లో గల వావ్ వరంగల్‌ను కమిషనర్ పరిశీలించి దీని చుట్టూ ప్రహరి గోడ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన భవనం కూల్చివేత పరి కరాలను నక్కలగుట్ట వార్డు కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం రాంపూ ర్,మడికొండ ప్రాంతాల్లో లేఅవుట్ అనుమతుల నిమిత్తం స్థలాలను పరిశీలించా రు. కమిషనర్ వెంట సిపి వెంకన్న, బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజయ్య, డి ఎఫ్ఓ శంకర్లింగం, ఏసిపి బషీర్,డీఈలు సంతోష్‌బాబులు పాల్గొన్నారు.