Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయోమయంలో అన్నదాతలు- అధికారుల క్షేత్ర సందర్శన
నవతెలంగాణ-శాయంపేట
యాసంగి సీజన్లో వేసిన వరి పంట నెల రోజులకే ఎండిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. కొత్త రకం వంగడం వల్ల పంట ఎండిపోతుందా, నేల సమస్యవల్ల పంట ఎండి పోతుందా తెలియక ఆ యోమయంలో కొట్టుమిట్టాడు తున్నారు. ఆరెకరాల పంట ఎండిపోవడంతో ఏవో గంగాజమున సందర్శించి పం టను పరిశీలించి చౌడు నేల సమస్య వల్ల పంట ఎండిపోయిందని గుర్తించారు. వివరాల్లోకి వెళితేమండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన అల్లం రాజ కొమురయ్య, మొగిలి ఆరెకరాల్లో యాసంగి సీజన్లో అన్నం రకానికి చెందిన వరి విత్తనం నాటాడు. నెలఐదు రోజులకే పంట పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తనకు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. ఈ విష యాన్ని విత్తనకంపెనీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వరి పంట ఎండిపో వడంతో వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, విషయం తెలుసుకు న్న ఏవో గంగాజమున, ఏఈఓ రాకేష్ మంగళవారం పంట క్షేత్రాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. నేలలో విపరీతమైన చౌడు ఉండడం వల్లనే పంట ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. పంట సాగుకు ముందు వ్యవసాయ భూమిలో జిప్సం, జీలగలు, పెంట వేసినట్లయితే పంట నష్టం జరిగి ఉండేది కాదని తెలిపారు. పంట తీసివేశాక మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్ష చేయించాలని సూచించారు. ప్రస్తుతం చైటేడ్జింక్ఎకరాకు 200 గ్రాములు స్ప్రే చేయాలని, పురుగు తెగులు నివారణకు ఎకరాకు శాప్ 200 గ్రాములు పిచి కారి చేయాలని ఏవో గంగా జమున రైతులకు సూచించారు.