Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఉత్తమ జోన్ చైర్మన్‌గా లయన్ మోత్కూరు వెంకట్‌కు లభించింది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ 6వ రీజియన్ ప్రాంతీయ సదస్సు సింగిడి సింహ సమ్మేళనం పేర రీజియన్ చైర్ పర్సన్ లయన్ ఉషామార్త అధ్యక్షతన చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సదస్సులో రిజియన్లో 8 క్లబ్బులు పాల్గొని తాము చేసిన సేవా కార్యక్రమాలను బ్యానర్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్బంగా సేవాకార్యక్రమాలు నిర్వహించిన క్లబ్బుల బాధ్యులకు రీజియన్ చైర్ పర్సన్ లయన్ ఉషామార్త అవార్డులను అందజేశారు. రెండవ జోన్, జోన్ చైర్మెన్‌గా విశేష సేవలందించిన లయన్ మోత్కూరు వెంకటరామారావు ఉత్తమ జోన్ చైర్మన్‌గా అవార్డు అందుకున్నారు. అట్లే లయన్స్ జిల్లాలో పేరెన్నిక గన్న లయన్స్ క్లబ్ భీమారంకు అనేక విభాగాలలో అవార్డులు లభించాయి. ఉత్తమ అధ్యక్షులుగా లయన్ సీహెచ్.రాజారాం, ఉత్తమ కార్యదర్శిగా లయన్ టి.అశోక్, కమిటెడ్ కోశాధాకారిగా లయన్ డి.ప్రసాదరావు, లయన్ మోత్కూరు మనోహర్ రావు, పొలసాని రవీందర్ రావు, ఉత్తమ లియోగ మూల హర్శిత, అట్లే క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్విరాన్మెంట్, ఐ స్క్రీనింగ్, హెల్త్ క్యాంప్స్, పీస్ పోస్టర్, బ్లడ్ డొనేషన్, బెస్ట్ బ్యానర్ ప్రజంటేషన్, బెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్, బెస్ట్ డ్రస్డ్ లయన్, బెస్ట్ డ్రెస్డ్ లయన్ లేడీ బెస్ట్ డ్రస్డ్ లయన్ కపుల్ మొదలగు విభాగాలలో మొత్తం 17 అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందని క్లబ్ చార్టర్ సభ్యులు పూర్వ జిల్లా గవర్నర్ లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు, లయన్ పి.మాలతిరఘోత్తంరెడ్డి తెలిపారు. క్లబ్ సేవలను గుర్తించి అవార్డులు అందజేసిన లయన్ ఉషామార్తకి జోన్ చైర్మన్ వెంకట్ తదితరులు కత్ఞతలు తెలియజేశారు.