Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
కమలాపూర్ మండలం గూడూరు శివారు మహాత్మాజ్యోతిభాపూలే బాలికల గురుకుల విద్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మం త్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలా కర్‌రెడ్డి,ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి అర్చక సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలం గాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌కి బ్రాహ్మణులతో అర్చకులతో అను బందం ఉండడానికి తెలంగాణ ఉద్యమాన్ని కూడా చండీయాగంతో ప్రారంభించారని తెలిపారు. సబ్బండవర్గాల సంక్షేమానికిన్యాయం చేస్తున్నారని తెలిపారు. 21 కు లాల అర్చక వ్యవస్థను దేవాలయాల ఉద్యోగాలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోనే దేవాలయాల అభివృద్ది, అర్చక, బ్రాహ్మణుల అభివృద్ది జరుగుతుందన్నారు. అర్చక వ్యవస్థను కాపాడి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేత నాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక జేఏసీ రాష్ట్ర చైర్మెన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం ప్రతినిధులు బి.ప్రణవ్, భరత్‌కుమార్, జంగమ రమేష్, శ్రీనివాస్, మఠం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.