Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
గర్భస్థ పిండలింగ నిర్ధారణ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ హెచ్చరించా రు. డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం వైద్య ఆరోగ్యశాఖ కార్యా లయం లో మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగింది ఈ స మావేశాన్ని ఉద్దేశించి ఆ యన మాట్లాడుతూ గర్భ స్థలింగ నిర్ధారణ చట్ట వ్య తిరేకమని దీన్ని ఎవరు ఉ ల్లంఘించినా పిసిపిఎన్ డి టి చట్ట ప్రకారం శిక్షార్హుల న్నారు. ఆడపిల్లలను పుట్టనివ్వడంతో పాటు ఎదగనివ్వాలని వారి అభివద్ధికి దోహదపడాలని సూచించారు.
గర్భిణి స్త్రీలకు స్కానింగ్ నిర్వహించిన వివరాలను స్కానింగ్ సెంటర్లో ప్రతినెల వైద్య ఆరోగ్యశాఖ కార్యా లయంలో రికార్డులను అందించాలని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ చేయడంతో పాటు గర్భాలను తొలగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండ ల పరిషరాములు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల అవగాహన ప్రజల్లో కల్పించి లింగ నిష్పత్తిని పెంచే అవకాశంలో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకో వాలని సూచించారు.
స్కానింగ్ సెంటర్ల గైనకాలజిస్టులకు రేడియాలజి స్టులకు నిర్ధారణపై అవగాహన శిక్షణతో పాటు సల హాలు ఇస్తే బాగుంటుందని సికేఎం ఆసుపత్రి గైనకాలజిస్ట్ వైద్యురాలు డాక్టర్ బి.కవిత, కార్యక్రమం సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్గోపాలరావు, డాక్టర్ ప్రకాష్, లీగల్ అడ్వైజరీ రేవతి దేవి, అనిల్‌కుమార్, రాజకు మార్, తదితరులు పాల్గొన్నారు.