Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
హన్మకొండ జిల్లాలో పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, మున్సిప ల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామా రావు ని కుడా చైర్మ న్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పలు అభివద్ధి కార్యక్రమాల ప్రారంభానికి, శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పూల మొక్కను అందించి సాదరస్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కు డా నిధులతో వరంగల్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. మంత్రి కేటీ ఆర్ పర్యటనలో భాగంగా రూ.1.30 కోట్ల లక్షల రూపాయల కుడా నిధులతో నిర్మించనున్న పలు పనులకు శంకుస్థాపన చేసి నట్లు కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు.
వాటిలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.50 లక్షలు, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కోసం 30 లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ కోసం రూ.20 లక్షలు, మార్కండేయ గుడి నిర్మాణం కోసం రూ.30 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఆయన వి వరించారు. పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.