Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ-వరంగల్
సమాజంలో తరతరాలుగా వస్తున్న అంతరాలు తొలగిపోయి ఆర్థికంగాసామాజికంగా ప్రజలంద రూ అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం ముందు కు పో తుందని, కేవీపీఎస్ దళిత,గిరిజన చట్టాలతో డైరీ , క్యాలెండర్ తీసుకరావడం అభినందనీయమ ని వరం గల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేవీపీఎస్ -2023 డైరీ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ దళిత గిరిజ న చట్టాల పౌర సమాచార హక్కులను, దేశం కోసం అ హర్నిశలు పాటుపడిన సా మాజిక రుగ్మతలను రూపు మాపేందుకు కృషి చేసిన మహానుభావుల జీవిత చరి త్రను సంక్షిప్తంగా పొందు పరచడం దళిత గిరిజనులకు ప్రభుత్వం అందుబాటు లో ఉంచే చట్టాలను జీవో కాపీలను సైతం ఇందులో పొందుపరచడం, ఒక సంక్షిప్త సమాచార దర్శినిగా కెవిపిఎస్ డైరీ ఉపయోగపడుతుందని అభినందించా రు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరూరి కుమా ర్ మాట్లాడుతూ సామాజిక ప్రజాస్వామిక హక్కులు అనేకం మన దేశ రాజ్యాంగం కల్పించిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంద న్నారు. కెవిపిఎస్ జిల్లాలో అనేక సామాజిక ఉద్య మాలు నిర్మించి ఫలితాలు సాధించిన సంస్థగా నిలి చిందన్నారు. ఒకగొప్ప సిద్ధాంతం స్పష్టమైన కార్యాచ రణతో కెవిపిఎస్ అనేక విజయాల సాధించిందన్నా రు. సామాజిక అనిచివేతకు ఆర్థిక దోపిడీకి వ్యతిరే కంగా కెవిపిఎస్ నిర్మించే అన్ని పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగితే ఉద్యమిస్తున్నటు వంటి యువతరం మనువాదం ద్వారా మన రాజ్యాంగా నికి పొంచి ఉన్న ప్రమాదం పైన సంఘటిత ప్రతిఘ టన ఉద్యమాలు నిర్మించాలన్నారు. గత 15 ఏళ్లుగా కెవిపి ఎస్ ముద్రిస్తున్న డైరీ మహనీయుల జీవిత చరిత్ర లతో పాటు అనేక చట్టాలు జీవోలు పొందుపరచడం జరిగిందన్నారు.డైరీఆవిష్కరణ కార్యక్రమంలో కేవిపి ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు హనుమకొండ ఆనం ద్, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉసిల్ల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి ఆవులఉదయ్,మైదం సంజీ వ హరినాథ్, వి.ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.