Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ఈనెల 2న యూఎస్పీసీ ధర్నాను విజయవంతం చేయాలని మంగళవారం హను మకొండ లోని తమ కార్యాలయంలో డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీనివాస్, టి.సుదర్శనం కోరారు. జెడ్పీహెచ్ఎస్ కోటగిరి, ని జాంబాద్ జిల్లాలో పనిచేయుచున్న మల్లికార్జున అనే ఉపాద్యాయుని పై జరిగిన దాడికి నిరసనగా మూడో కార్యక్రమంగా ఈనెల 2న ఉదయం10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదుట ధర్నాను చేస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్ర మంలో ముఖ్యంగా మల్లికార్జున్ ఉపాధ్యాయునిపై అక్రమంగా మోపిన కేసులను బేశరతుగా ఉపసంహరించుకోవాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులకు తరగతిగదిలో స్వేచ్ఛగా పాఠాలు బోధించే పరిస్థితులు ఉండా ల ని కోరుకుంటున్నట్లు తెలిపారు.అత్యంత ప్రాధాన్యమైన అంశంగా తీసుకొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నదని అన్నారు.