Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
పశువుల పెంపకం దారు లు, రైతులు తమ పశువులను బ్రూసెల్లోసిస్ (ఈచుడు రో గం, అబార్షన్) అనే వ్యాధి నుంచి కాపాడుకొనుటకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వే స్తున్న టీకాల పంపిణీ కార్యక్ర మాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధి కారి డాక్టర్ సునీల్ అన్నారు. మండలంలోని తహరాపూర్ గ్రామంలో మంగళవారం సిబ్బందితో కలిసి లేగ దూడలకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం పట్ల రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు. వ్యాధి నివారణ టీకాలు 4-8 నెలల వయసు కలిగిన లేగ దూడలకు ఇచ్చి నట్లయితే జీవితకాలం ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాయన్నారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి తగ్గుతుందని, మేత మేయవన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ తాటికొండ మౌనిక రవికిరణ్, వి ఎల్ వో రమేష్ బాబు, జెవిఓ సారంగం, విఏ సదానందం రైతులు పాల్గొన్నారు.