Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లా స్వార్థం కోసమే రోడ్డు విస్తరణ
నవతెలంగాణ-కాశిబుగ్గ
రోడ్డువెడల్పులో ఇండ్లు,ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితు లకు న్యాయం చేశాకే కూల్చి వేతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మం గళవారం మున్సిపల్ అధికారులు 15వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంటలోని జిల్లా పరిషత్ పాఠశాల కాంపౌండ్‌వాల్ కూల్చివేయడన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకు న్నారు. ఈసందర్భంగా మాజీ ఎంపీటీసీ పోలేపాక సుమన్, 15వ డివిజన్ కాం గ్రెస్ అధ్యక్షుడు ఎలగొండ ప్రవీణ్, గొర్రెకుంట గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల సంపత్, తదితరులు మాట్లాడుతూ రోడ్డువిస్తరణలో 36మంది దళిత కుటుంబాలు ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్నారని ముందుగా వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 32పిట్ల రోడ్డు ఉందని ఈ దారిగుండా ఎలాంటి భారీ వాహ నాలు వెళ్లేది లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి 100 ఎకరాలభూమి ఉందని, అదేవిధంగా చల్ల రఘు పతిరెడ్డికి అక్రమ డాంబర్ ప్లాంటు, రెడీమిక్స్, పైపుల కంపెనీలు ఉన్నందున కేవలం వారి స్వార్థం కోసమే రోడ్డు వెడల్పు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసు కొని రోడ్డువిస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధిత కుటుంబాలకు న్యా యం చేయాలని విజ్ఞప్తి చేశారు.