Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
నవతెలంగాణ-కేసముద్రంరూరల్
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతం చేస్తూ వారు తీసుకునే రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించే విధంగా బాధ్యతలు వహిస్తూ ప్రభుత్వ పథకా లను మహిళలకు చేరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న వివోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా కమి టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు మారిపల్లి మాధవిలి మాట్లా డుతూ వివోఎల సమస్యల పైన శాసనసభలో రాబోయే బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కనీస వేతనం 15,000 ఉండే విధంగా వివోఏలకు ఆరోగ్య భీమా, మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత లాంటి సౌక ర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలల కమిటీ వారు జిల్లా కోశాధికారి వసంత, జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకట లక్ష్మి, జిల్లా కార్యదర్శి కళావతి కేసముద్రం మండల అధ్యక్షురాలు సునీత, లక్ష్మి, శ్రీనివాస్, అనసూర్య, రజిత, లావణ్య, స్వాతి, కవిత, మైబు, రవి, సంధ్య, సునీత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.