Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో ఆర్సీవో కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ఉన్న అన్ని గిరిజన గురుకులల్లో, డిగ్రీ గురుకులాల్లో నాణ్యమైన భో జనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలోతో సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానుకోట ఆర్సిఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడా రు.జిల్లాలోని ఓ డిగ్రీ గురుకులంలో నాసరికమైన భోజనం పెడుతున్నారని విద్యా ర్థుల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ దృష్టికి తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురు కులాల్లో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి ఒక లక్ష 20 వేలు ఖర్చు పెడు తుంటే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా దళారులకు కుమ్మకై నాసరికమైన భోజనం అందిస్తున్నారని, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకో వాలన్నారు. అదేవిధంగా గురుకులాల్లో మేస్ అండ్ కాస్మొటిక్ చార్జీలు పెంచాల న్నారు.డివిజన్కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ మెనూ పాటిం చని సిబ్బందిపై చర్యలు తీసుకోవలన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు.లేనియెడల ఆందో ళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సింహాద్రి, పట్టణ నాయకులు ఉపేందర్, నితిన్, వినోద్, చంటి, రాజేష్, వినరు తదితరులు పాల్గొన్నారు.