Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర విద్యుత్ మండలి లోటు భర్తీ చేసుకోవాల నే సాకుతో ప్రజలపై అదనపు భారాల మోపటం సరి కాదని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా తొర్రూర్ డివిజ న్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగం గా మంగళవారం తొర్రూర్‌లోని డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, పలు డిమాండ్లతో కూడి న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 2,500 కోట్ల లోటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోలేక వినియోగదారులపై మో పటం బోర్డు అసమర్థతకు నిదర్శనం అని అన్నారు. ప్రజలు రకరకాల పేర్లతో ఇప్పటికే ఆర్థిక భారాలలో, అనేక అవస్థలు పడుతుంటే అవి తీర్చాల్సిన రాష్ట్ర ప్ర భుత్వం బాధ్యత మరిచిందన్నారు.పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజ లు ఇబ్బంది పడుతుంటే మరోవైపు మూలిగే నక్క మీద తాటికాయబడ్డ చందంగా అభివృద్ధి పేరుతో అదనపు కరెంటు బిల్లులు మరో భారంగా మారాయ న్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతు న్న కేసీఆర్ ఆచరణలో ఎండుతున్న పంటలను క్షేత్ర స్థాయిలో చూడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విద్యుత్ మండలకి ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్ర మైన తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, రైతుబంధు, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం మారిందని ఆరోపించా రు. తెలంగాణ సమస్యలు గాలికి వదిలిన కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా మార్పు తీసుకొస్తా నని తెలంగాణప్రజలను, దేశంలోని ప్రజానీకాన్ని మో సం చేస్తూ కాలం వెళ్ళ బుచ్చడం తప్ప మరో ప్రయో జనం ఏమి లేదన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెంకన్న, భీమానరసయ్య, సాయిలు, వెం కన్న, యాకమ్మ, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
గంగారం : రాష్ట్ర విద్యుత్ మండలి లోటు భర్తీ చేసుకోవాలనే పేరుతో ప్రజలపై అదనపు భారాల మోపటం సరికాదని సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా గంగారం, కొత్తగూడెం మండలాల కార్యదర్శి పూణెం ప్రభాకర్ అన్నారు. సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా రా ష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం గంగా రం సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, మల్లయ్య, సురేష్, బిక్షం, సమ్మయ్య, వెంకన్న, లక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోనీ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా దాని అను బంధ రైతు సంఘాల సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వ హించి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజే శారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా సబ్ డివిజనల్ కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ విని యోగదారుల మీద ఏసీడీ పేరుతో అదనపు విద్యుత్ భారాన్ని మోపిందన్నారు. విద్యుత్ ఛార్జీలను ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, తెలం గాణ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది మరొ కటి లాగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో అం దిస్తామని, చెప్పి కోతలు అనేవి లేకుండా చేస్తామని దానిని అమలుకు పూనుకోవడం లేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు విధిస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తు న్నారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకా రం తెలంగాణలో ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటును ప్రజలకు సరఫరా చేయాలండి డిమాండ్ చేశారు. కరెంటు కోతలను ఎత్తివేయాలని వ్యవసాయ రైతులకు 24గంటల విద్యుత్ అందించాలని డిమాం డ్ చేశారు. ఏసిడి పేరుతో ప్రజలపై అదనపు విద్యుత్ భారాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభార త వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగాని సత్యం, సిపిఐఎంఎల్ ప్రజాపదా సబ్ డివి జన్ నాయకులు, జక్కుల యాకయ్య, పార్టీ టౌన్ కమి టీ సభ్యులు ముత్యాల భద్రయ్య, గుర్రం పూర్ణ, భక్తుల కష్ణ, గుట్టయ్య, గణేష్, సోమిరెడ్డి, రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.