Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఇల్లు కట్టుకు నేందుకు రూ.5లక్షలు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్రంలో పోడు భూముల పట్టాలతో పాటు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జే వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు 280, 283, 284, 285 సర్వే నెంబర్లలోని 24 ఎకరాల భూమి లో పార్టీ అద్వర్యములో నిర్వహిస్తున్న గుడిసె వాసుల పోరాటం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన ఏర్పాటుచేసిన గుడిసె వాసుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 పైగా సెంటర్లలో ఇండ్ల స్థలాల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బడాపెట్టుబడిదారులు చెరువులను కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలి ఇస్తున్నట్టుగానే పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే పట్టాలు ఇవ్వాలన్నారు. లేదంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దమెర కిరణ్ ,చెన్నురి రమేష్ ,కంపెటి రాజన్న, పొలం రాజేందర్ ,జిల్లా కమిటీ సభ్యులు.డబ్బా రాజన్న, పొలం చిన్న రాజేందర్, అత్కురి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.