Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధికి గుర్తులుగా ఉన్న నిర్మాణాలు చేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టియు) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బిల్లా కంటి సూర్యంలి అన్నారు. తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలు పులో భాగంగా బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో ఆఫీసు నుండి కొరివి బస్టాండ్ వరకు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జిల్లా కలెక్టరే ట్లో ఏవోకు ప్రతినిది బృందం వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల క్రితం రూపొందించిన సంక్షే మ పథకాలను పెరిగిన ధరల కనుగుణంగా నేడు పెంచాలని కోరారు. సహజ మరణానికి లక్ష 30 నుండి 5 లక్షలు, ప్రమాద మరణానికి ఆరు లక్షల నుండి పది లక్షలు, పెళ్లి కానుక డెలివరీలకు 30 వేల నుండి లక్ష రూపాయల వరకు పెంచా లని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలను ఇస్తానని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర, కేంద్ర ప్ర భుత్వాలు కార్మికుల కష్టార్జితం సంక్షేమ నిధి డబ్బులు ఇతర అవసరాలకు వాడటం అన్యాయమన్నారు. కరోనా కాలంలో కార్మికుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొ రేట్ కంపెనీలను ఆదుకున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా నాయకులు ఎండి.మౌలానాతో పాటు సాంబయ్య, బలరాం, మురళి, నాగరాజు, వెంకన్న, ఈవైఎల్ జిల్లా కార్యదర్శి పైండ్ల యాకయ్య తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.