Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలో బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారం భించారు తొలి రోజు బుధవారం ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సీతామహా లక్ష్మి దంపతులు బొడ్రాయికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించే కార్యక్రమాలకు తొలి రోజు అంకురార్పణ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో బొడ్రా యి పున:ప్రతిష్టకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడ బొడ్రాయి కార్యక్రమాలు గద్దెలు నిర్మాణం చేశారు. గ్రానైట్‌తో చెక్కించిన బొడ్రాయికి పాలకొడిసే చెక్కతో చేయించిన పోతరాజుకు బుధవారం వేణుగోపాలస్వామి గుడి సమీపంలో ఎమ్మె ల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్రేన్ సహాయంతో బొడ్రాయిని ట్రాక్టర్ పైకి ఎక్కించి మానుకోటలో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుంచిశివాలయం ఆర్టీసీ బస్టాండ్ మదర్ తెరిసా సెంటర్ మున్సిపల్ ఆఫీస్ అండర్ బ్రిడ్జి నెహ్రూ సెంటర్ తాసిల్దార్ కార్యాలయ సెంటర్ మీదుగా రా మాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహిం చారు. పాత బొడ్రాయి జీర్ణోధరణ నిర్వహించనున్నారు. మూడవ తేదీన మధ్యా హ్నం రెండు గంటలు, నాలుగో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరం జలాభిషేకం నిర్వహించనున్నారు.మూడవ తేదీన యాగశాల వద్ద కుంకుమ పూజ నిర్వహించనున్నారు. నాలుగో తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదో తేదీన ఉదయం నాలుగు గంటల 49 నిమిషాలకు బొడ్రాయి ప్రతిష్ట నిర్వ హించనున్నారు. ఐదో తేదీన అన్ని కులాల వారు బోనాలు సమర్పించనున్నారు. ఐదో తేదీన ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు బలిముద్దా వేయను న్నారు. ఐదో తేదీన మొత్తం బొడ్రాయి పండుగ నిర్వహించనున్నారు.