Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం అధ్యక్షుడు లయన్ ఏలికట్టే నరేందర్ అధ్యక్షతన స్థానిక కెమిస్ట్రీ భవన్లో మంగళవారం రాత్రి చార్టర్ నైట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విశ్వమానవ సౌబ్రాతత్వా న్ని ప్రభోదించే లయన్స్ సంస్థ సభ్యులు కావడం గర్వకారణ అన్నారు. ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా వెంటనే స్పందించే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థకు మిలీనియం సభ్యులు తమ వంతు విరా ళాలు ఇచ్చి సభ్యత్వాన్ని కలిగి ఉండడం అభినందనీయం అన్నారు. మొదటగా చా ర్టర్ సభ్యులు, పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. పూర్వ జిల్లా గవర్నర్ లయన్ లవకుమార్ రెడ్డి క్లబ్ సబ్యులు చేసిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా ఏనుగు నర్సిరెడ్డి కో-ఛైర్మెన్ గాగాదె నర్సింహలు వ్యవ రించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మేడే పూర్ణ చందర్ జిల్లా నాయకులు నాగబండి రవీందర్,అల్లాడి ప్రభాకర్, కొర్రెముల యాదగిరి, శ్రీరామ్, శ్రీనివాస్, కృష్ణ జీవబజాజ్, రీజియన్ చైర్మన్లు దోర్నాల వెంకటేశ్వర్లు, గంగిశెట్టి ప్రమోద్ కు మార్, నాయకులు రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర ఆర్య, డాక్టర్ డి.అజిత్ కుమార్, ఎన్.సుధాకర్ రెడ్డి, పి.హరికిషన్ రెడ్డి, ఎం.అశోక్, కర్రే కృష్ణ, కడకంచి మధుసూదన్, జి.బిక్షపతి, రంగరాజు ప్రవీణ్‌కుమార్, యాట వెంకన్న, బైరు వెంక టేశ్వర్లు, బాలరాజు, దాసరి సుమన్, బి.నాగరాజు, బి.బిక్షపతి, గాదె వెంకటేశ్వర్లు, ఉమాకార్ లక్ష్మణ్, జిల్లాశ్రీను వివిధ క్లబ్లఅధ్యక్షులు,సభ్యులు పాల్గొన్నారు.