Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సీతారాంపురం లో భాషా పండిత సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక పో రాట, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యాచరణ లో భాగంగా ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి రాష్ట్రం లోని అన్ని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్స్, తెలుగు, హిందీ, ఉర్దూ, వ్యాయామ ఉపా ధ్యాయులు తొమ్మిదవ, పదవ తరగతి ఉన్నత తరగ తుల బోధనను బహిష్కరిస్తూ వారికి జాబ్ చార్ట్ ద్వా రా పనిచేయాల్సిన తరగతులు 6,7,8 అని మాత్రమే తెలియజేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గ్రేడ్ 2 భాషా పండితులను వ్యాయామ ఉపాధ్యాయులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పి ఇప్పటివరకు కూడా అది అమలు చేయకపోవడంతో ప్రభుత్వానికి వారి యొక్క నిరసనను తెలియజేశారు. ఈ విషయాన్ని పై అధికా రుల దృష్టికి తీసుకెళ్లి న్యాయబద్ధమైన హక్కును పొం దడానికి సహకారం అందించాలని ఉపాధ్యాయులు రాజకుమారి వ్యాయామ ఉపాధ్యాయురాలు, తెలుగు భాష ఉపాధ్యాయులు కే.వెంకన్న, ఎం.సురేష్, హిం దీ ఉపాధ్యాయులు సఫియా బేగం, ఏ.ఉమాదేవి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు తేళ్ళ శ్రీనివాస్ వారి యొక్క విన్నపాన్ని అందజేశారు.
భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి
పెద్దవంగర:ప్రభుత్వం భాషా పండితులు, పీఈ టీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు వెంకన్న, శ్రీనివాస్, షౌకత్ అలీ అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజరు కుమార్‌కు 9,10 తరగతులకు బోధన నిరా కరణతో పాటుగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడు తూ రెండు దశాబ్దాలుగా భాషా పండితులు, పీఈటీ లతో స్కూల్ అసిస్టెంట్ పనులు చేయిస్తూ, అన్యా యానికి గురి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసేలా పోస్టులు అప్‌గ్రేడ్ చేస్తూ జీవోలు ఇచ్చినా వాటిపై కోర్టు కేసుల నెపం చూపి స్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి భాషా పండితులు, పీ ఈటీలకు పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాబ్ చార్ట్ ప్రకారం 6,7,8 తరగతులకు మాత్రమే విద్యా బోధన చేపడ తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు గొట్టిముక్కుల శ్రీనివాస్‌రెడ్డి, సదయ్య, విజయ్ కుమార్,శ్రీధర్,సువర్ణ,యాకన్న పాల్గొన్నారు.