Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యం గా ఉద్యమిద్దమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి పిలుపు నిచ్చారు. స్థానిక ప్రయాసంగాల కార్యాలయంలో బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం దడిగ సందీప్ అధ్యక్ష తన నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్ఎల్ మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న అ సెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం బ డ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి విద్యారంగాన్ని పూర్తి గా విస్మరిస్తుందని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటం గా ప్రారంభించిన గురుకులాలలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నా కానీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గురుకులాలలో చాలావరకు ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమ ర్శించారు.విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ ఫీజు, రియంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో, సకాలంలో విడుద ల చేయలేని పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులు అమ రుల త్యాగఫలితంగా తెలంగాణ సాధించుకుంటే ఈ రోజు విద్యార్థులకే అన్యాయం జరుగుతుందని ఆవే దన వ్యక్తం చేశారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలని డి మాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా వాటి ఊసే లేకుండా పోయిన పరిస్థితి కనబ డుతుందన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భో జనాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు మెస్ బిల్లులు కేవ లం 1500 రావడం వలన విద్యార్థులకు కనీస పౌష్టి ఆహారం లేక అనారోగ్య పాలవుతున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటింగ్ చార్జీలు 3000 రూపాయల పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనగామలో కనీసం రెగ్యులర్ టిడబ్ల్యూడిఓ లేడని వెంటనే ఆ పోస్ట్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వార్డె న్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో అద్దె భవనంలో కొనసాగుతున్నా యన్నారు. ఆయా సంక్షేమ శాఖ మంత్రులు పట్టిం చుకోని శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చాలావరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేని పరిస్థితి కనిపిస్తుందన్నారు. వెం టనే వాటిని ఏర్పాటు చేసి స్కావెంజర్లు నియమించా లని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరి ష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాబోయే రో జుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయ న హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం, జిల్లా నాయకులు యకన్న, తరుణ్, విష్ణు, మనోజ్, వరుణ్ తదితులున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి
తొర్రూరు:ఫిబ్రవరి మూడవ తేదీ నుండి ప్రారం భమయ్యే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పట్ల మధు డిమాండ్ చేశారు. బుధవా రం ఎస్ఎఫ్ఐ తొర్రూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నానిర్వహించి అనం తరం సీనియర్ అసిస్టెంట్ సూరయ్యకు వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా మధు మాట్లాడు తూ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా విద్యారం గానికి నిధులు తగ్గిస్తున్నారని అన్నారు. నిధులు తగ్గ డం వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. దానితో పాటు దాదాపు 4 వేల కోట్ల పెం డింగ్ స్కాలర్షిప్ ఉండడం వలన విద్యార్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే పెం డింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మండ ల కార్యదర్శి అమీర్, మండల నాయకులు మణి కుమార్, మహెష్, ప్రవీణ్, నవీన్, మునేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.