Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియా
నవతెలంగాణ-గూడూరు
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడు లను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆ పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవా రం మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం తీగలవేణి గ్రామంలో పిఎస్, జడ్పీపీఎస్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడు తూ సీఎం కేసీఆర్ పాలనలో మధ్యతరగతి ప్రజలు పిల్లలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య ను పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని విడ తలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు జరు గుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుజాత మోతిలాల్ తీగలలేని ఎంపీటీసీ వెన్ వాసు దేవారెడ్డి, తీగలవేణి సర్పంచ్ వేం శైలజమోహన్ రెడ్డి, గూడూరు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వేం వెంకటకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్,తాసిల్దార్ ఎమ్.అశోక్ కుమార్, ఎంపీడీవో రోజా రాణి, ఎంఈఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ డిఇ రాజలింగం, ఏఈ యశ్వంత్, వివిధ శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ ప్రారంభోత్సవం...
గార్ల :కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభు త్వ పాఠశాలను తీర్చిదిద్దుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలకు పునర్జివనం పోస్తున్నారని ఇల్లందు ఎ మ్మెల్యే బానోత్ హరిప్రియా అన్నారు.తెలంగాణ ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేపట్టిన మం డలంలోని పెద్ద కిష్టాపురం ప్రాథమిక పాఠశాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పం చ్ గంగావత్ కుంతీ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మె ల్యే హరిప్రియా మాట్లాడుతూ గత ప్రభుత్వాల హ యాంలో ప్రభుత్వ పాఠశాలలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్న తరుణం లో సియం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల అభివృ ద్ధికి నడుంబిగించారన్నారు. మండలంలో18 పాఠశా లలు ఈ పథకంలో ఎంపిక కాగా పెద్ద కిష్టాపురం, గార్ల ప్రాథమిక పాఠశాలు మోడల్ పాఠశాల లలు 12 రకాల వసతులతో సుందరంగా తీర్చిదిద్దారన్నా రు. కార్పొరేట్ పాఠశాలలకు ఎ మాత్రం తీసిపోని వి ధంగా పునర్నిర్మాణం చేసిన ప్రభుత్వ పాఠశాలలో వి ద్యార్థులను చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్ర జాప్రతినిధులు, అధికారుల పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటీసి అళోత్ ఫరేంగన్, ఉప స ర్పంచ్ శోభ, మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, త హశీల్దారు ఈ.రాము, ఎంపిడివో రవీందర్, డిఈ వెం కటరెడ్డి, ఎంఇవో పూల్‌చంద్, ఎంపివో రజిని, పంచా యతీ కార్యదర్శి క్రాంతి, ఎఈ శ్రీనివాస్, సర్పంచ్‌లు ఎ.బన్సీలాల్, బి.మోతీలాల్, డి.సక్రు,పాఠశాల చైర్మన్ మోతీలాల్, హెచ్‌యం. యం.శివ, బిఆర్ఎస్ నాయ కులు జి.లక్ష్మణ్‌నాయక్, యం.శ్రీనివాస్ పాల్గొన్నారు.