Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
నవతెలంగాణ-పర్వతగిరి
మండల పరిధిలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. పర్వతగిరి మండలానికి సంబంధించి పర్వతగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బు ధవారం పర్వతగిరి మండల అభివృద్ధి పనులపై వివి ధశాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వ హించారు.ఈ సంద ర్బం గా గ్రామాల వారీగా జరు గుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు, ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ గ్రామాల అభి వృద్ధిలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని అలాగే అభి వృద్ధి పనులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేద ని స్పష్టం చేశారు. పర్వతగిరి మండలంలోని ప్రతీ గ్రామంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల అభివద్ధి విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. నియోజ కవర్గ పరిధిలోని అన్ని మండలాలను ఆదర్శ మండ లాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికా రులతో పాటు ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా కషి చేయాలనీ పిలుపునిచ్చారు.
అనంతరం ఆయా మండలాల ప్రజా ప్రతినిధు లు, ముఖ్య నాయకులతో పార్టీ పటిష్టానికి తీసుకోవా ల్సిన చర్యలపై చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ చేపడుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాడమే కాకుండా, పార్టీ బలోపేతానికి ప్రతీకార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాలనీ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పిటీసి బానోతు సింగులాల్,వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమార్,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు, పార్టీ అనుబంధ సంఘాలు, ముఖ్య నా యకులు తదితరులు పాల్గొన్నారు.