Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీసుగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫోరం
నవతెలంగాణ-గీసుగొండ(ఆత్మకూర్)
అవినీతి అక్రమాలలో కూడుకపోయిన బిఆర్ ఎస్ పార్టీ అంతమే..కాంగ్రెస్ పార్టీ పంతంగా పెట్టు కొని పని చేస్తామని గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, వాంకుడోతు మణిగోపాల్, కాయిత బిక్షపతి, దౌడు కోమల భరత్ అన్నారు. బుధవారం హన్మకొం డలోని కాంగ్రెస్ పరకాల ఇంచార్జి ఇనగాల నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడు తూ పరకాల నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యే కాం ట్రాక్టుల కోసమే రోడ్డులు వేశారు తప్ప అభివృద్ధిలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అధికారులను భ యభ్రాంతులకు గురిచేసి బినామీపేర్లతో కోట్లాది రూ పాయల పనులు నాసిరకంగా చేసి భారీగా బిల్లులు తీసుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పతనం మొదలైం దన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములు పంచకుండా భూకబ్జాలకు అధికార పార్టీ నేతలే పా ల్పపడ్డ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నా రు. రోజురోజుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి అనుచరుల దాడు లు దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయని రాబోయే ఎన్నికల్లో గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. గీసుగొండ కాంగ్రెస్పార్టీకి కంచుకోట అని ఇప్ప టికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల అమ్ము డుపోతున్న నాయకుల కబ్జాలపైప్రజలు చర్చించు కుంటున్నారు.ఈ విషయాన్నీ కాం గ్రెస్ పార్టీ నాయ కులు కార్యకర్తలు ఇంటి ఇంటికి తీ సుకుపోయి ప్రజ లను చైతన్యవంతులను చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన కాంగ్రెస్పార్టీతోనే అభివద్ధి సాధ్యమ వుతుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి హామీలు ఇ వ్వడం మోసంచేయడమే వారి నై జంగా పెట్టుకున్నా రని వారు విమర్శించారు.
ఉచిత కరెంటు, రైతులకు ఏకకాలంలోనే రుణా లను మాఫీచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ద క్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు దళిత బందు ఇస్తామని హామీలతో మోసం చేయడం తప్ప ఆచరణలో కార్యరూపం తల్చడంలేదన్నారు. ప రకాల నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు ద ళిత బంధు పథకం ఇచ్చారో శ్వేతా పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గీసుగొండ మండల అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీనివాస్, వంచనగి రి ఎంపీటీసీ సారంగం, జిల్లా నాయకులు చాడ కొమ రారెడ్డి,మండలయూత్ అధ్యక్షులు ఆకుల రుద్రప్ర సాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, గ్రామ అధ్యక్షులు డౌడు ప్రవీణ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.